రష్యా, చైనా దేశాలు నాటో దళాల విస్తరణను ఖండిస్తూ సంయుక్త ప్రకటన చేశాయి. వింటర్ ఒలింపిక్స్ గేమ్స్ ప్రారంభోత్సవం నేపథ్యంలో బీజింగ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌లు భేటీ అయ్యారు. నాటో దళాలు తెస్తున్న వత్తిడిని రెండు దేశాలు ఖండిరచాయి. తైవాన్ అంశంలో చైనాకు మద్దతుగా నిలుస్తున్నట్లు రష్యా ప్రకటించింది. ఆ ద్వీపకల్పానికి స్వాతంత్యాన్ని నిరాకరిస్తున్నట్లు రష్యా చెప్పింది. ఉక్రెయిన్ అంశంలోనూ నాటో దళాలు చేస్తున్న హడావుడిని రెండు దేశాలు ఖండిరచాయి. ఉక్రెయిన్‌పై యుద్ధానికి వెళ్లడం లేదని రష్యా తెలిపింది. ఆ రెండు దేశాల సరిహద్దుల్లో మాత్రం టెన్షన్ వాతావరణం ఉంది.నాటో దళాలు ప్రచ్చన్న యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్నాయని, ఆకస్ సెక్యూర్టీ ఒప్పందం కూడా కలవరపెడుతున్నట్లు రెండు దేశాలు పేర్కొన్నాయి. చాలా స్నేహపూర్వక వాతావరణంలో పుతిన్, జిన్‌పింగ్ మధ్య చర్చలు జరిగినట్లు అధికారులు తెలిపారు.