Namaste NRI

రష్యా బలగాల ఆశ నెరవేరలేదు : ఉక్రెయిన్‌

కీవ్‌ను హస్తగతం చేసుకోవాలనుకున్న రష్యా బలగాలను అడ్డుకున్నామని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వోలోదిమర్‌ జెలెన్‌స్కీ ప్రకటించారు. రష్యా బలగాలను మన మిలటరీ అడ్డుకుంది అని తెలిపారు. కీవ్‌ను స్వాధీనం చేసుకొని తన అడ్డు తొలగించుకోవాలకున్న రష్యా బలగాల ఆశ నెరవేరలేదన్నారు. అలాగే తమ దేశంపై చోరబాటును ఆపాల్సిందిగా వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఒత్తిడి చేయాలని రష్యా ప్రజలను కోరారు. రాజధాని కీవ్‌ దాని చుట్టుపక్కల ఉన్న ప్రధాన పట్టణాలను రష్యా బలగాల నుంచి కాపాడుకున్నట్లు వెల్లడిరచారు. అదే సమయంలో తమ దేశానికి మద్దతుగా రష్యాలో నిరసనలు చేస్తున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీకు, మాకు, ప్రపంచానికి అబద్దాలు  చెప్పేవాళ్లను అడ్డుకోండి అని అభ్యర్థించారు.  తమ దేశంలోకి చొరబడినందుకు రష్యా ప్రభుత్వాన్ని శిక్షించాలని, ఆ దేశానికి స్విఫ్ట్‌ వ్యవస్థతో ఉన్న సంబంధాలను కత్తిరించాలని హంగేరి, జర్మనీ దేశాలను డిమాండ్‌ చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events