Namaste NRI

జెలెన్‌స్కీని హిట్లర్‌తో పోల్చిన రష్యా విదేశాంగ మంత్రి

రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని ఉద్దేశించి విమర్శనాస్త్రాలు సంధించారు. జెలెన్‌స్కీ జర్మనీ నియంత్ర అడాల్ఫ్‌ హిట్లర్‌తో పోల్చారు. హిట్లర్‌, జెలెన్‌ స్కీ ఇద్దరూ కూడా నాజీలేనని, వారిద్దరిలో ప్రవహిస్తున్నది యూదు రక్తమేనని అన్నారు. అయితే రష్యా విదేశాంగ మంత్రి యూదు  రక్తం వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ మండిపడిరది. దీనిపై ఇజ్రాయెల్‌ విదేశాంగ మంత్రి యాయిర్‌ లాపిడ్‌ ఘాటుగా స్పందించారు. రష్యా మంత్రి  లవ్రోవ్‌ చేసిన వ్యాఖ్యలు క్షమించరానివని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ దారుణమైన ప్రకటన చేయడం ద్వారా చారిత్రక తప్పిదానికి పాల్పడ్డారని మండిపడ్డారు. నాటి మారణహోమంలో యూదులు తమను తాము చంపుకోలేదని లాపిడ్‌ స్పష్టం చేశారు. యాదులు ఎదుర్కొన్నది ఓ మోస్తరు జాతివివక్షేనని, అంతకంటే ఎక్కువగా యూదులు తమలో తామే వైరిభావం ప్రదర్శించారని విమర్శించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events