అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సహాయం కోరారు. రష్యాలోని బడా బాబులతో అమెరికా అధ్యక్షుడు బైడెన్ కుమారుడు హంటర్ బైడెన్‌కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఆరోపించారు. బైడెన్ కుటుంబానికి ఇబ్బంది కలిగించే ఎలాంటి సమాచారం ఉన్న తనకు అందజేయాలని రష్యా అద్యక్షుడు పుతిన్‌ను కోరారు. హంటర్ బైడెన్‌కు రష్యా లోని మాస్కో సిటీ మేయర్ భార్య 3.5 మిలియన్ డాలర్లు ఇచ్చారు. హంటర్‌కు అంత డబ్బు ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందో పుతిన్‌కు తెలుసు. కారణం పుతిన్ బయటపెట్టాలని అని ట్రంప్ అన్నారు. హంటర్‌కు రష్యాతో వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ట్రంప్ తెలిపారు. ముఖ్యంగా రష్యాతో హంటర్ బైడెన్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని ఆరోపించిన ఆయన ఆ వివరాలను పుతిన్ బయటకు చెప్పాలన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/telusukada-300x160.jpg)