ఉక్రెయిన్పై యుద్ధంలో రష్యాకు ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. జెలెన్స్కీ సేనలు మెరుపు దాడులతో మాస్కో బలగాలను దెబ్బతీస్తున్నాయి. ఈ క్రమంలో రష్యా అధ్యక్షుడు పుతిన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప రక్షణమంత్రి జనరల్ దిమిత్రి బుల్గకోవ్ను ఆ పదవి నుంచి తప్పించారు. బుల్గకోవ్ 2008 నుంచి రష్యా మిలిటరీ లాజిస్టిక్స్ నిర్వహణ బాధ్యతలు చూస్తూ వచ్చారు. లాజిస్టిక్స్ నిర్వహణలో వైఫల్యం కారణంగానే ఇటీవల ఖర్కివ్ ప్రాంతం నుంచి మాస్కో సేనలు వెనుదిరగాల్సి వచ్చిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ కారణంగా పుతిన్ బుల్గకోవ్ను పదవి నుంచి తప్పించినట్లు చెబుతున్నారు. మిజింట్సేవ్, మేరియుపోల్ విధ్వంసకుడిగా అపకీర్తి మూటగట్టుకున్నారు. అక్కడి ఆర్ట్ గ్యాలరీలు, ప్రసూతి ఆసుపత్రులు, థియేటర్లు ఆయన ఆధ్వర్యంలోనే నేలమట్టమయ్యాయి. బుల్గకోవ్ స్థానంలో కర్నల్ జనరల్ మిఖాయిల్ మిజింట్సెవ్ను నియమించారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)