రష్యా సేనలు తనను తన కుటుంబ సభ్యులను పట్టుకునేందుకు తమకు అత్యంత సమీపానికి వచ్చాయని ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్స్కీ తెలిపారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం తీవ్రంగా ఉన్న తొలి నాటి రోజులను జెలెన్స్కీ గుర్తు చేసుకున్నారు. బాంబుల దాడి మొదలైందని చెప్పడానికి తమ 17 ఏండ్ల పాప, తొమ్మిదేండ్ల బాబు దగ్గరకు తాను, తన భార్య ఒలెనా జెలెన్స్కీ నడుచుకుంటూ వెళుతున్నామని తెలిపారు. అప్పటికే పేలుళ్లు మొదలయ్యాయన్నారు. దీంతో జెలెన్స్కీని రష్యా సేనలు లక్ష్యంగా చేసుకుంటాయని, అధ్యక్ష కార్యాలయాలు సురక్షితం కాదని నిర్ణయానికి వచ్చామన్నారు. ప్యారాచూట్లతో కీవ్లోకి ప్రవేశించి తనను హత్య చేయడం గానీ, సజీవంగా పట్టుకోవడం కానీ చేయాలని రష్యా సేనలకు ఆదేశాలు ఉన్నాయన్నారు.














