ఉక్రెయిన్పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తునే ఉంది. ప్రధాన నగరాలను టార్గెట్ చేస్తూ రష్యా దాడులు కొనసాగిస్తుంది. ఇటు రష్యా సేనల దాడులను ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది. ఈ క్రమంలో రష్యా కీలక ప్రకటన చేసింది. తాము విధించిన షరతులకు అంగీకరిస్తే ఉక్రెయిన్పై తక్షణమే యుద్ధాన్ని నిలిపివేస్తామని రష్యా ప్రకటించింది. షరతులకు ఓకే చెబితే తక్షణమే సైనిక చర్యను నిలిపేస్తామని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రెసె సెక్రెటరీ డిమిత్రీ పెస్కోవ్ ప్రకటించారు. ఉక్రెయిన్ ప్రభుత్వం ముందు రష్యా నాలుగు షరతులను విధించింది. ఒకటి సైనిక చర్యను ఆపాలి. రెండు తటస్ఠంగా ఉండేలా రాజ్యాంగాన్ని మార్చాలి. మూడు క్రిమియాను రష్యా భూభాగంగానే గుర్తించాలి. నాలుగు డొనెట్స్క్ లుహాన్స్క్ ప్రాంతాలను స్వతంత్ర ప్రాంతాలుగా అంగీకరించాలి. ఈ నాలుగు డిమాండ్లను రష్యా ఉక్రెయిన్ ముందు ఉంచింది. వీటిని గనక ఒప్పుకుంటే తక్షణమే యుద్దాన్ని నిలిపేస్తామని రష్యా ప్రకటించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)