Namaste NRI

రష్యా కీలక ప్రకటన…విజయం మాదే

ఉక్రెయిన్‌ పై భీకర దాడులు చేస్తున్న రష్యా తాజాగా కీలక ప్రకటన చేసింది. ఉక్రెయిన్‌పై తాము చేపడుతున్న సైనిక చర్యలో తొలి దశ విజయవంతం అయిందని వెల్లడిరచింది. తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను అందుకున్నామని పేర్కొంది. ఇకపై తమ దళాలు డాన్‌ బాస్‌ ప్రాంతానికి పరిపూర్ణ స్వేచ్ఛ కల్పించడంపై దృష్టి సారిస్తాయని రష్యా తన ప్రకటనలో పేర్కొంది.  కాగా రష్యా దళాలు ఉక్రెయిన్‌లోని స్లావుటిచ్‌ పట్టణాన్ని స్వాదీనం చేసుకున్నాయి. ఈ పట్టణంలో చెర్నోబిల్‌ అణుకేంద్రం  ఉద్యోగులు నివసిస్తుంటారు. అటు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ లో తాజాగా కర్ఫ్యూ విధించారు.  మేరియుపోల్‌ నగరంలో పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. నగర వీధుల్లో రష్యా సేనలకు, ఉక్రెయిన్‌ బలగాలకు మధ్య హోరాహోరీ పోరు జరుగుతోందని నగర మేయర్‌ తెలిపారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events