ఉక్రెయిన్‌కు దీర్ఘశ్రేణి క్షిపణులను సరఫరా చేయరాదని రష్యాకు చెందిన సీనియర్ దౌత్యాధికారి ఒకరు అమెరికాను హెచ్చరించారు. ఉక్రెయిన్ పోరులో ప్రత్యేక్ష ప్రమేయానికి అగ్రరాజ్యం చేరువలో ఉందన్నారు. తమ దేశ ఉనికి ప్రమాదంతో పడితే అణ్వస్త్రాల వినియోగానికీ వెనుకాడబోమని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌ను ఆయుధాలతో ముంచెత్తడం వ్లల తలెత్తే విపరణామాల గురించి అమెరికాను పదేపదే హెచ్చరించాం. అయినా పద్ధతి మార్చుకోవడం లేదు అని రష్యా విదేశాంగ శాఖ ఉపమంత్రి సెర్గెయ్ ర్యాబోకోవ్ పేర్కొన్నారు. తమ లక్ష్యాలు సాధించే వరకూ ఉక్రెయిన్‌లో పోరాటం సాగిస్తూనే ఉంటామన్నారు. అమెరికా సరఫరా చేసిన హైమార్స్ బహుళ రాకెట్ లాంచర్ల వల్ల ఉక్రెయిన్ సైనిక పోరాట సామర్థ్యం మెరుగుపడిరది. ఈ ఆయుధాల సాయంతో ప్రత్యర్థి మౌలిక వసతులు, ఇతర సౌకర్యాలపై ఇటీవల భారీగా దాడి చేసింది. జీపీఎస్ మార్గనిర్దేశంలో అత్యంత కచ్చితత్వంతో విరుచుకుపడగల ఈ అస్త్రాలు 80 కిలోఈటర్ల దూరంలోని లక్ష్యాలను చేధించగలవు.