రోడ్డు ప్రమాదానికి గురై జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ప్రముఖ నటుడు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు తాజా హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. సాయి తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. చికిత్సకు స్పందిస్తున్నారు. ఇంటర్నల్‌గా ఎటువంటి గాయాలు లేవు. ప్రధాన అవయవాలు బాగానే పనిచేస్తున్నాయి. ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నాం అని అపోలో ఆస్పత్రి వైద్యులు వెల్లడిరచారు.
స్పోర్ట్స్ బైక్‌పై ప్రయాణిస్తున్న సాయిధరమ్ తేజ్ ప్రమాదవశాత్తూ కిందపడిపోవడంతో తీవ్రగాయాలైన విషయం తెలిసిందే. ప్రమాదం జరిగిన వెంటనే సాయితేజ్ అపస్మారక స్థితిలో వెళ్లారు. ఆ తర్వాత వైద్యానికి స్పందించారు. హెల్మెట్ ఉన్నా ప్రమాద తీవ్రత కారణంగా గాయాలు బలంగా తగిలాయి. వెంటనే స్పందించిన స్థానికులు, పోలీసులు 108 సాయంతో దగ్గర్లోని మెడికవర్ ఆస్పత్రిలో చేర్చారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం అపోలో ఆసుపత్రికి తరలించారు.