అనిల్, యువతేజ, ముస్కాన్, రూప ప్రధాన పాత్రల్లో నటించిన హారర్ థ్రిల్లర్ పంజరం. సాయికృష్ణ దర్శకుడు. ఆర్.రఘన్రెడ్డి నిర్మాత. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌ని నిర్వహించారు. దర్శకుడు మాట్లాడుతూ నేపథ్య సంగీతం ఈ చిత్రానికి ప్రధాన బలం.ఈ సినిమాకు పనిచేసిన అందరూ పెద్ద స్టార్స్ అవుతారు. ఈ ప్రయాణానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు అన్నారు.

దర్శకుడు సాయి ఈ సినిమాను గొప్పగా తీశాడని, సినిమా అందరికీ నచ్చుతుందని హీరోలు యువతేజ, అనిల్ అన్నారు. ఈ సినిమాలో భాగం అయినందుకు కథానాయిక రూప ఆనందం వెలిబుచ్చారు. ఇంకా మరో కథానాయిక ముస్కాన్, మ్యూజిక్ డైరెక్టర్ నాని మోహన్, నటులు రమణ, ప్రదీప్, నటి పద్మ కూడా మాట్లాడారు. నిర్మాణం తుదిదశకు చేరుకున్న ఈ చిత్రం త్వరలో విడుదల కానున్నది.
















