సాయిధరమ్‌తేజ్‌తో కలిసి అగ్రహీరో పవన్‌కల్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం బ్రో. సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై జీ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. సాయిధరమ్‌తేజ్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఫస్ట్‌లుక్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రంలో సాయిధరమ్‌తేజ్ మార్కండేయులు అనే పాత్రలో కనిపించనున్నారని దర్శకుడు తెలిపారు.
పవన్‌కల్యాణ్ ఈ చిత్రంలో దేవుడి పాత్రలో నటిస్తున్నారు. ఓ సామాన్య యువకుడికి, దేవుడికి మధ్య నడిచే డ్రామా నేపథ్యంలో సోషల్ ఫాంటసీ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బ్రో సినిమా 2023, జులై 28న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల విడుదల కానుంది. ప్రస్తుతం చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. దాదాపు చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుగుతోంది. చిత్ర నిర్మాణ కార్యక్రమాలన్నీ త్వరగా పూర్తి చేసి.. ప్రేక్షకులను కొత్త అనుభూతిని పంచే అద్భుతమైన చిత్రాన్ని అందించాలని చిత్ర బృందం ఎంతో ఉత్సాహంగా ఉంది. ఈ చిత్రానికి కెమెరా: సుజిత్ వాసుదేవ్, సంగీతం: తమన్, రచన-దర్శకత్వం: సముద్రఖని.














