Skip to main content

Namaste NRI

సాయిలు కంపాటి- సుమంత్ ప్రభాస్ కొత్త చిత్రం.. పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా లాంచ్

శ్రీవెంకటేశ్వర సినిమాస్ తమ ప్రతిష్టాత్మక ప్రొడక్షన్ నెం.10ను అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. పూస్కూర్ రామ్ మోహన్ రావు, భరత్ నారంగ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీ సాయిలు కంపాటి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్ ప్రభాస్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా సికింద్రాబాద్ గణేష్ టెంపుల్‌లో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభమైంది. సదా నంద్ మేకర్స్‌కు స్క్రిప్ట్‌ను అందించగా, దర్శకుడు శేఖర్ కమ్ముల ముహూర్తపు షాట్‌కు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. హీరో అడివి శేష్ క్లాప్ కొట్టగా, తొలి షాట్‌ను దర్శకుడు శ్రీ సాయిలు కంపాటి డైరెక్ట్ చేశారు. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

దర్శకుడిగా తన రెండో సినిమాతో శ్రీ సాయిలు కంపాటి రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలిసిన ఓ హార్ట్‌ వార్మింగ్ రస్టిక్ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నారు. స్మాల్ టౌన్ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో ప్రేమకథతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్, ఎంటర్‌టైన్‌మెంట్‌కు మంచి ప్రాధాన్యం ఉంటుంది. సుమంత్ ప్రభాస్ తన ఎనర్జీకి తగ్గ ఫుల్ ఎంటర్‌టైనింగ్ క్యారెక్టర్‌లో కనిపించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events