దక్షిణ సినీ రంగానికి ప్రతిష్ఠాత్మకంగా భావించే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (సైమా) వేడుకలు వాయిదా పడ్డాయి. హైదరాబాద్‌లో ఈ ఏడాది సెప్టెంబరు 11, 12న వేడుకలు నిర్వహించాలని భావించినా అనివార్య కారణాల వల్ల వాటిని వాయిదా వేస్తున్నట్టు నిర్వాహకులు తెలిపారు. అయితే సెప్టెంబర్ 18, 19 తేదీల్లో ఈ వేడుకను జరపనున్నట్టు వారు ప్రకటించారు. హైదరాబాద్‌లోనే ఈ వేడుక జరగనుంది. కరోనా కారణంగా గతేడాది ఈ వేడుకలు నిర్వహించలేదు.