ప్రతిష్ఠాత్మక సైమా (సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) 2023 అవార్డ్స్ వేడుక సెప్టెంబరు 15, 16 తేదీల్లో దుబాయ్ లో అంగరంగవైభవంగా జరగనుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం రానా మాట్లాడారు. ఈ వేడుకతో నాది 11 ఏళ్ల బంధం. గ్లోబల్ ప్లాట్‌ఫాంకి చేరువ అవడానికి సైమా గొప్ప వేదిక. ఇందులో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని రానా దగ్గుబాటి అన్నారు. దక్షిణాది సినిమాల్లో నటించడం మొదలుపెట్టినప్పటి నుంచి సైమాతో తనకు అనుబంధం ఉందని, లెజెండ్రీ కళాకారులతో కలిసి స్టేజ్ పంచుకునే అవకాశం రావడం నిజంగా అదృష్టమని నిధి అగర్వాల్ ఆనందం వ్యక్తం చేసింది. మీనాక్షీ చౌదరి మాట్లాడుతూ సైమా అవార్డ్స్‌లో పాల్గొనడం నాకిదే ప్రథమం. సైమా కేవలం ఓ వేడుక కాదు. సినిమా వాళ్లకు ఓ పండుగ. ఈ పండుగలో భాగం అవ్వడం ఆనందంగా ఉంది అన్నారు.
సైమా చైర్ పర్సన్ బృందా ప్రసాద్ మాట్లాడుతూ సైమా వేడుక అన్ని చిత్ర పరిశ్రమలకు ఒక రీయూనియన్, హోమ్‌కమింగ్ లాంటిది. రానా గారి గురించి మాటల్లో చెప్పలేను. ఆయన లేకుండా సైమా వేడుకని ఊహించలేం. నిధి అగర్వాల్ ఇదివరకే వేడుకల్లో పాల్గొన్నారు. మీనాక్షి కి స్వాగతం. సైమా వేడుకలకు కౌంట్ డౌన్ మొదలైయింది. రాబోయే రెండు వారాలు ఇంకా మరింత ఎక్సయిటెడ్ గా వుంటుంది. సెప్టెంబర్ 15, 16న దుబాయ్ లో కలుద్దాం అన్నారు.