వెంకటేశ్ 75వ సినిమా సైంధవ్. శైలేష్ కొలను దర్శకత్వంలో వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ సినిమా కొత్త షెడ్యూల్ శ్రీలంకలో మొదలైంది. ఈ షెడ్యూల్‌లో కీలకమైన టాకీతోపాటు కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలు కూడా చిత్రీకరించనున్నామనీ, అలాగే ఓ పాటకు సంబంధించిన మాంటేజ్‌లు కూడా చిత్రీకరించడం జరుగుతుందని, వెంకటేశ్‌తోపాటు సినిమాలోని ముఖ్యతారాగణం మొత్తం ఈ షెడ్యూల్‌లో పాల్గొంటారని దర్శకుడు తెలిపారు.ఈ చిత్రంలో నవాజుద్దీన్ సిద్ధిఖీ, ఆర్య, శ్రద్ధా శ్రీనాథ్, రుహానీశర్మ, ఆండ్రియా జెరెమియా, సారా, జయప్రకాష్ తదితరుల నటిస్తు న్నారు. ఈ సినిమా కథ పూర్తిగా ఈ 8 పాత్రల చుట్టూనే తిరుగుతుంది. పాన్ ఇండియా మూవీ సైంధవ్ అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి సంగీతం: సంతోష్ నారాయణ్, కెమెరా: ఎస్.మణికందన్, ఎడిటర్: గ్యారీ బిహేచ్, నిర్మాణం: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్.
