Namaste NRI

శాకుంతలం  త్రీడీ ట్రైలర్‌ విడుదల

సమంత ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక నేపథ్య సినిమా శాకుంతలం. ఈ చిత్రాన్ని దిల్‌ రాజు సమర్పణలో నీలిమ గుణ నిర్మిస్తున్నారు. మహాకవి కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం అనే సంస్కృత నాటకం ఆధారంగా ఈ చిత్రాన్నిదర్శకుడు గుణశేఖర్‌ రూపొందించారు. ఇందులో దుష్యంతుడిగా దేవ్‌ మోహన్‌ కనిపించనున్నారు. 3డి టెక్నాలజీతో విజువల్ వండర్‌గా తెలుగు, హిందీ, తమిళం, హిందీ, మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకులను అలరించనుంది. తాజాగా హైదరాబాద్‌లో ఈ సినిమా త్రీడీ ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నీలిమ గుణ మాట్లాడుతూ త్రీడీ ఫార్మేట్‌లో వస్తున్న తొలి పౌరాణిక నేపథ్య చిత్రమిదే. త్రీడీలోకి సినిమాను మార్చాలనే ఆలోచన దిల్‌ రాజుది. మా సినిమాలోని అందమైన విజువల్స్‌ త్రీడీ వల్ల మరింత బ్యూటిఫుల్‌గా మారాయి. మా చిత్రాన్ని చూసి ఆస్వాదిస్తారని కోరుకుంటున్నా అన్నారు.

 దర్శకుడు గుణశేఖర్‌ మాట్లాడుతూ శకుంతల పాత్రకు ప్రాణం పెట్టి ప్రాణప్రతిష్ట చేశారు సమంత. ఈ పాత్ర కోసమే ఆమె పుట్టారా అనిపిస్తుంది. సినిమా విడుదలయ్యాక మీరు చెప్పే మాటలు వినాలని అనుకుంటున్నాను. శాకుంతలం కథను సినిమా కోసం మార్చలేదు. 90 శాతం ఆ కథనే ఆనుసరించాం. దిల్‌ రాజు లాంటి ప్రొడ్యూసర్స్‌ ఉండటం వల్లే ఇంత భారీ ప్రయత్నాలు చేయగలుగుతున్నాం  అన్నారు. నిర్మాత దిల్‌ రాజు మాట్లాడుతూ తెలుగు సినిమా ప్రపంచఖ్యాతిని పొందుతున్నది. ఇలాంటి సమయంలో శాకుంతలం వంటి సినిమా రావడం సంతోషకరం. ఒక గొప్ప సినిమాలో నేనూ ఉండాలని నిర్మాణంలో భాగమయ్యాను. ఇలాంటి సినిమా చేస్తే వీఎఫ్‌ఎక్స్‌, ఇతర విషయాల్లో ఎంతో నేర్చుకోవచ్చు అని భావించాను. తెలుగు సినిమాలను మనం ప్రపంచానికి చూపిస్తూనే ఉండాలి. ఆక్రమంలో నా తొలి అడుగు శాకుంతలం. విజువల్‌ వండర్‌గా ప్రేక్షకుల్ని అలరిస్తుంది  అన్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్‌ 14న విడుదల కానుంది. ఈ కార్యక్రమంలో ఎడిటర్ ప్రవీణ్ పూడి, రైటర్ సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events