Skip to main content

Namaste NRI

కుటుంబ కథాంశంతో సకుటుంబానాం

రామ్‌కిరణ్‌, మేఘా ఆకాష్‌ జంటగా నటిస్తున్న చిత్రం సకుటుంబానాం. ఉదయ్‌శర్మ దర్శకుడు. రాజేంద్ర ప్రసాద్‌, బ్రహ్మానందం ప్రధాన పాత్రల్ని పోషిస్తున్నారు. సత్య, శుభలేఖ సుధాకర్‌, రాజశ్రీనాయర్‌, రచ్చ రవి, గిరిధర్‌, తాగుబోతు రమేష్‌ తదితరులు నటిస్తున్నారు.   ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌, మోషన్‌ పోస్టర్‌ను విడుల చేశారు. దర్శకుడు మాట్లాడుతూ సకుటుంబ సమేతంగా చూసి ఆనందించే చిత్రమిది. కథ చాలా కొత్తగా ఉంటుంది. ఎంతో మంది సీనియర్‌ నటులు ఈ సినిమాలో భాగమయ్యారు. వినోదం, ఫ్యామిలీ సెంటిమెంట్‌ ప్రధానంగా ప్రేక్షకుల్ని మెప్పిస్తుంది అన్నారు. రొటీన్‌కు భిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ఇదని, సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుందని నిర్మాత మహదేవ గౌడ్‌ తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: మధు దాసరి, సంగీతం: మణిశర్మ.

Social Share Spread Message

Latest News