Namaste NRI

సామజవరగమన టైటిల్ పోస్టర్‌ రిలీజ్

హీరో శ్రీవిష్ణు దర్శకుడు రామ్ అబ్బరాజుతో ఓ వినోదాత్మక సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమ షూటింగ్ చివరి దశలో ఉంది. కాగా తాజాగా చిత్రబృందం ఈ సినిమా టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.ఏ.కే ఎంటర్టైనమెంట్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు సామజవరగమన అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. వీణను, శ్రీవిష్ణును ఒకే దగ్గర రెడ్ కలర్ రిబ్బన్‌తో కట్టేసున్న పోస్టర్ సినిమాపై కాస్త ఆసక్తి రేకెత్తిస్తుంది. హీరోయిన్‌గా రెబా మోనికా జాన్ నటిస్తుంది. హాస్య మూవీస్ బ్యానర్పై రాజేష్ దండ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.  గోపి సుందర్ స్వరకల్పనలో రూపొందుతున్న ఈ సినిమా వేసవిలో హాస్యపు విందులు వడ్డించడానికి ముస్తాబువుతుంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress