
అగ్ర కథానాయిక సమంత వివాహ బంధంలోకి అడుగుపెట్టింది. కోయంబత్తూర్‌లోని ఈశా ఫాండేషన్‌లోని లింగభైరవి ఆలయంలో దర్శకుడు రాజ్ నిడిమోరుతో సమంత పెళ్లిపీటలెక్కింది. వీరిద్దరికిది రెండో వివాహం. కొద్ది మంది కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ జంట పెళ్లి వేడుక నిరాడంబరంగా జరిగింది. వివాహ ఘట్టం పూర్తయిన కొద్దిసేపటికే సమంత తన పెళ్లి ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది. పెళ్లిలో సమంత జరీ వర్క్ కలబోసిన ఎరుపు రంగు చీరలో మెరిసిపోయింది. కొత్త జంట చిరునవ్వులు చిందిస్తూ ఉల్లాసభరితంగా కనిపించారు.















