Namaste NRI

కోర్టును ఆశ్రయించిన సమంత

టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ సమంత కోర్టును ఆశ్రయించారు. తనకు పరువుకు భంగం కలిగేలా వ్యవహరించిన మూడు యూట్యూబ్‌ ఛానల్స్‌పై కూకట్‌పల్లి కోర్టులో పరవు నష్టం దావా పిటిషన్‌ దాఖలు చేశారు.  సుమీన్‌ టీవీ, తెలుగు పాపులర్‌ టీవీ, మరో చానల్‌తో పాటు సీఎల్‌ వెంకట్రావు అనే అడ్వకేట్‌పై సమంత కోర్టులో పిల్‌ దాఖలు చేశారు. అక్కినేని నాగచైతన్యతో ముగిసిన తన వైవాహిక జీవితానికి సంబంధించి ఆ రెండు చానళ్లలో వెంకట్రావు అసత్య ప్రచారాలు చేస్తూ కించపరిచారని పిటిషన్‌లో పేర్కొన్నారు. తన వ్యక్తిగత  జీవితం గురించి అభ్యంతరకర వీడియోలు, కించపరిచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని, టీవీ వల్ల తన గౌరవానికి భంగం వాటిల్లుతోందని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. పరువు నష్టం ఎంతనేది తర్వాత కోరతానన్నారు. ఇకపై దుష్ప్రచారం చేయకుండా మధ్యంత ఆదేశాలివ్వాలని,  ప్రసారమైన ఇంటర్వూలను తొలగించేలా ఆదేశించాలని కోరారు. ఇక సమంత పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరుగనుంది. సమంత తరపున హైకోర్టు న్యాయవాది బాలాజీ కోర్టులో వాదనలు విపిపించనున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events