Namaste NRI

సమంత యశోద టీజర్‌ వచ్చేసింది

సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం యశోద. వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, ఉన్ని ముకుందన్‌, రావు రమేష్‌, మురళి శర్మ, సంపత్‌ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు. తాజాగా  సినిమా టీజర్‌ను విడుదల చేశారు. యశోదలో సమంత గర్భవతిగా కన్పించనున్నారని టీజర్‌ను చూస్తే తెలుస్తోంది. గర్భిణీలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో లేడీ డాక్టర్‌, ఆమెకు చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఆమె జీవితంలో ఘటనలు జరుగుతున్నట్టు టీజర్‌లో చూపించారు. ఈ సినిమాలో ఉన్ని ముకుందన్‌ డాక్టర్‌ రోల్‌ చేస్తున్నారు. టీజర్‌లో కంటెంట్‌ మాత్రమే కాదు, క్వాలిటీ అవుట్‌ఫుట్‌ కూడా ఉంది. విజువల్స్‌ రిచ్‌గా ఉన్నాయి. లొకేషన్స్‌ అట్రాక్ట్‌ చేశాయి. మణిశర్మ నేపథ్య సంగీతం ఉత్కంఠ పెంచింది. ఇందులో సమంత చాలా కొత్తగా కన్పించింది.  చిత్ర నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్‌ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అన్ని  భాషల ప్రేక్షకులు నుంచి టీజర్‌కు మంచి స్పందన లభించింది. జాతీయస్థాయిలో దాదాపు 1400కు పైగా థియేటర్లలో టీజర్‌ను విడుదల చేశారు. ఈ చిత్రానికి శ్రీదేవి మూవీ పతాకంపై ప్రొడక్షన్‌ నెం14గా  శివలెంక కృష్ణ ప్రసాద్‌ నిర్మిస్తున్నారు. హరి`హరీష్‌ ఈ చిత్రానికి దర్శకులు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events