స్వలింగ వివాహాలకు అగ్రరాజ్యం అమెరికా ఓకే చెప్పింది. దీనికి సంబంధచిన బిల్లుకు అమెరికా కాంగ్రెస్ (పార్లమెంట్) లోని ప్రతినిధుల సభ ఆమోదం తెలియజేసింది. బిల్లుకు మద్దతుగా 258 మంది ఎంపీలు, వ్యతిరేకంగా 169 మంది ఓటు వేశారు. మొత్తం డెమొక్రాట్లతో పాటు 39 మంది ప్రతిపక్ష రిపబ్లికను కూడా మద్దతు తెలిపారు. మిగతా 169 మంది వ్యతిరేకించారు. రెస్పెక్ట్ ఫర్ మ్యారేజ్ యాక్ట్ అని పిలుస్తున్న ఈ బిల్లు గత నెలలోనే ఎగువ సభ అయిన సెనేట్‌లో ఆమోదం పొందింది. ఇప్పుడు దిగువ సభ సైతం ఆమోదించడంతో ఇక అధ్యక్షుడు జో బైడెన్ వద్దకు వెళ్లనుంది. ఆయన సంతకం చేస్తే బిల్లు చట్టరూపం దాలుస్తుంది.
