అమెరికాలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా మోదీ అమెరికా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ప్రసంగించారు. అగ్రదేశంలో కీలక పదవుల్లో కొనసాగుతున్న ప్రవాస భారతీయులపై ఆయన ప్రశంసలు కురిపించారు. భారత మూలాలు కలిగిన ఎందరో వ్యక్తులు ప్రస్తుతం అమెరికాలో తమ మార్క్ చూపిస్తున్నారు. వారిలో కొందరు చట్టసభల్లో కూడా కూర్చున్నారు అని ఉపాధ్యక్షురాలు, ఇతర ప్రవాస భారత చట్టసభ సభ్యులను ఉద్దేశించి అన్నారు. ఈ కాంగ్రెస్‌లో సమోసా కాకస్ ప్లేవర్ ఉందని నేను విన్నాను. ఇది మరింత విస్తరించాలని ఆశిస్తున్నా. భారత్‌లోని భిన్న రుచులన్నీ ఇక్కడ ఉండాలని కోరుకుంటున్నాను అని అమెరికాలో భారతీయుల ప్రాధాన్యం పెరగాలన్న ఉద్దేశంతో ఈ చమత్కారం చేశారు.
సమోసా కాకస్ భారత్‌లో ప్రాచుర్యం పొందిన సమోసా వంటకం పేరు మీదుగా ఈ పేరు వచ్చింది. అమెరికా చట్టసభలకు ఎన్నికైన దక్షిణాసియా మూలాలున్న వ్యక్తులు మరీ ముఖ్యంగా భారతీయులను ఉద్దేశించి ఈ పదాన్ని వాడతారు. రెండు శతాబ్దాలుగా అమెరికన్లు, భారతీయుల జీవితాల నుంచి ఒకరినొకరు స్ఫూర్తి పొందుతున్నామని ప్రధాని ఈ సందర్భంగా వెల్లడిరచారు.