బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు హీరోగా నటిస్తున్న చిత్రం కాల్యీ ఫ్లవర్. శీలో రక్షతి రక్షిత అనేది ఉపశీర్షిక. ఆశా జ్యోతి గోగినేని నిర్మిస్తున్నారు. ఆర్కే మలినేని దర్శకుడు. ఈ చిత్రాన్ని నవంబరు 26న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు వెల్లడిరచారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సంపూర్ణేష్ బాబు మాట్లాడుతూ ఒక మగాడు తనకు జరిగిన అన్యాయంపై చేసిన పోరాటమే ఈ క్యాలీఫ్లవర్. నిర్మాతలకు తొలి చిత్రమైనా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు. నా నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో అవన్నీ ఇందులో ఇచ్చే ప్రయత్నం చేశా. అందరూ అశీర్వదిస్తారని ఆశిస్తున్నా అన్నారు. నన్ను నమ్మి ఇంత మంచి సినిమాలో అవకాశమిచ్చినందుకు దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. ప్రజ్వల్ అద్భుతమైన సంగీతమిచ్చారంది నాయిక వాసంతి. ఈ సినిమాకి సంగీతం : ప్రజ్వల్ క్రిష్, ఛాయాగ్రహణం: ముజీర్ మాలిక్. ఇతర ప్రాతల్లో పోసాని కృష్ణమురళి, ఫృధ్వీ, నాగ మహేశ్, గెటప్ శీను, రోహిని, కాదంబరి కిరణ్, కల్యాణీ నటిస్తున్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/donaldTrump-3-300x160.jpg)