శివ కందుకూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మను చరిత్ర. మేఘా ఆకాష్, ప్రగతి శ్రీవాస్తవ్ కథానాయికలు. భరత్ పెదగాని దర్శకుడు. ప్రొద్దుటూర్ టాకీస్ పతాకంపై ఎన్.శ్రీనివాస రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో సుహాస్, డాలీ ధనంజయ్, శ్రీకాంత్ అయ్యంగార్ తదితరులు నటిస్తు న్నారు. తాజాగా ఈ చిత్రంలో ఇప్పుడే పరిచయం అనే పాటను కథానాయిక సంయుక్తమీనన్ విడుదల చేసింది. గోపీసుందర్ స్వరపరచిన ఈ మెలోడీ గీతాన్ని చంద్రబోస్ రచించారు. ఆర్మాన్ మాలిక్ ఆలపించారు. ప్రేమ భావాలకు అద్దం పడుతూ ఈ పాట సాగింది. ఈ చిత్రం నెల 23న విడుదలకానుంది. ఈ చిత్రానికి కెమెరా: రాహుల్ శ్రీవాత్సవ్, సంగీతం: గోపీసుందర్, రచన-దర్శకత్వం: భరత్ పెదగాని.

















