శాన్ ఫ్రాన్సిస్కో కాన్సుల్ జనరల్ ఆఫ్ ఇండియా డాక్టర్ శ్రీకర్ రెడ్డి కొప్పులకి అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ (ఏఐఏ) ఆధ్వర్యంలో ఘన స్వాగతం లభించింది. బే ఏరియా గళం విజయ ఆసూరి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 36 స్థానిక భారతీయ ఆర్గనైజేషన్ సభ్యులు విచ్చేసి శ్రీకర్ రెడ్డి ని అభినందించారు. వేద మంత్రోచ్ఛారణలతో డాక్టర్ రెడ్డిని, ఆయన సతీమణి ప్రతిమను స్థానికులు ఘనంగా సన్మానించారు. తన పట్ల ఇంతటి అభిమానం చూపిస్తున్న భారత, తెలుగు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన ధన్యవాదాలు తెలియజేశారు.

అమెరికా, భారత్ మధ్య మరింత మెరుగైన ద్వైపాక్షిక సంబంధాల కోసం పాటు పడతానని డాక్టర్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ప్రముఖ నాయకులు జయరామ్ కోమటి, రాజ్ బానోత్, జీవన్ జుక్షితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాన్సుల్ అధికారి డాక్టర్ అకున్ సభర్వాల్ కూడా పాల్గొన్నారు. డాక్టర్ రమేష్ కొండ ఈ కార్యక్రమాన్నిసమన్వయ పరిచారు. మిల్ పిటాస్, శాన్ హోసె, ఫ్రీమాంట్ నగరాలకు చెందిన మేయర్లు, ప్రజా ప్రతినిధులు, భారతీయ ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఆయనకి శుభాకాంక్షలు తెలిపారు.

