Skip to main content

Namaste NRI

గాంధీ జయంతికి సందీప్ కిషన్‌ సిగ్మా

సందీప్‌ కిషన్‌ కథానాయకుడిగా రూపొందుతున్న యాక్షన్‌ అడ్వెంచర్‌ సిగ్మా. జాసన్‌ సంజయ్‌ దర్శకుడు. లైకా ప్రొడక్షన్స్‌ పతాకంపై సుభాస్కరన్‌ నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ దశలో ఉన్నది. ఈ విషయాన్ని తెలియజేస్తూ మేకర్స్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. గాంధీ జయంతి హాలిడేతో పాటు వీకెండ్‌ కూడా కలిసి రావడంతో ఈ డేట్‌ సినిమాకు మంచి అడ్వాంటేజ్‌ కానున్నదని మేకర్స్‌ అభిప్రాయపడ్డారు.

ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌లో హీరో సందీప్‌ కిషన్‌ ఇంటెన్స్‌ అవతారంలో కనిపిస్తున్నారు. కిటికీ నుంచి సూర్య కిరణాలు తనని తాకుతుండగా, ఆ వెలుతురులో కనిపిస్తున్న అతని లుక్‌ సినిమాపై క్యూరియాసిటీని పెంచుతున్నది. ఆయన పక్కనే ఓ కుక్క కూడా ఉండటం గమనార్హం. ఫరియా అబ్దుల్లా, రాజు సుందరం, సంపత్‌రాజ్‌, శివ పండిట్‌, అన్బు థాసన్‌, యోగ్‌ జపే తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. అక్టోబర్‌ 2న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: క్రిషన్‌ వసంత్‌, సంగీతం: ఎస్‌.థమన్‌.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events