Namaste NRI

సంజయ్ రావ్, ప్రణవి మానుకొండ నయా మూవీ ప్రారంభం

 సంజయ్‌ రావ్‌, ప్రణవి మానుకొండ జంటగా మైక్‌ మూవీస్‌ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నది. బ్రహ్మాజీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా హైదరాబాద్‌లో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్‌ చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. ఇందులో సంజయ్‌ చాలా కొత్తగా కనిపిస్తారు. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణ మొదలవుతుంది అని చిత్ర నిర్మాతలు తెలిపారు. వినూత్న ప్రేమకథగా ఈ సినిమా తెరకెక్కనుంది. త్వరలో రెగ్యులర్‌ చిత్రీకరణకు సన్నాహాలు చేస్తున్నారు. మైక్‌ మూవీస్‌ నిర్మిస్తున్న నాలుగో చిత్రమిది. ఈ సినిమాకి సంగీతం: భీమ్‌, సిసిరోలియో, ఛాయాగ్రహణం: శ్రీనివాస్‌ జె.రెడ్డి. ఏఆర్‌ శ్రీధర్‌ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని అప్పిరెడ్డి, వెంకట్‌ అన్నపరెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events