తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఇనుమడిరపజేలాే విదేశాల్లోనూ మన పండుగలను చేసుకోవడం ముదావహమని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. మలేషియాలో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమైన సంక్రాంతి సంబరాలకు గంటా శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ 2019లో ప్రారంభించి మలేషియాలోని తెలుగు వారందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చిన అసోసియేషన్ భవిష్యత్తులో మరిన్ని గొప్ప కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. మలేషియాలో తెలుగు వాళ్లందరూ కలిసి చేస్తున్న సంక్రాంతి సంబరాలకు తప్పకుండా హాజరవుతామని డాక్టర్ అమర్‌కు చాలాకాలం క్రితం హామీ ఇచ్చామని, అయితే ఇదే సమయానికి విశాఖలో సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ టూర్‌లు ఆ తర్వాత ఖరారయ్యాయని పేర్కొన్నారు. తెలుగు వారిని నిరాశ పరచకూడదన్న ఉద్దేశంతో సీఎంవోకు సమాచారమిచ్చి సంక్రాంతి సంబరాల్లో పాల్గొడం జరిగిందన్నారు.


విదేశాల్లో ఉన్న వారు సైతం ఆశీర్వదించడం వల్లే ఎన్నికల్లో అత్యధిక సీట్లు, భారీ మెజారిటీలతో ఎన్నికై కూటమి ప్రభుత్వం చరిత్ర సృష్టించిందన్నారు. చంద్రబాబు నాయకత్వంపై నమ్మకంతో విదేశాల నుంచి కూడా వేలాది మంది వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారని తెలిపారు. రాష్ట్రానికి తీవ్ర ఆర్థిక సమస్యలున్నప్పటికీ అభివృద్ధిని, సంక్షేమా న్ని సమన్వయం చేసుకుంటూ స్వర్ణాంధ్ర ప్రదేశ్ దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. స్వచ్ఛంద కార్యక్రమా ల్లో పాల్గొంటూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం కావాలని మలేషియాలో స్థిరపడిన ఆంధ్రులను ఆయన కోరారు. రాష్ట్రంలో ఉండే వారు కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటుందని తెలిపారు. ఈ సందర్భంగా సంక్రాంతిని ప్రతిబింబించే సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, మలేషియా మా అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ అమర్ తదితరులు పాల్గొన్నారు.

