
ప్రియదర్శి నటిస్తున్న తాజా చిత్రం సారంగపాణి జాతకం. మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకుడు. శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. ఇంటిల్లిపాదినీ కడుపుబ్బా నవ్వించే చిత్రమిదని, ఆద్యంతం చక్కటి హాస్యంతో మెప్పిస్తుందని, ఇటీవల విడుదలైన టీజర్లో సారంగపాణి ప్రపంచాన్ని ఆవిష్కరించామని నిర్మాత పేర్కొన్నారు. వేసవిలో వినోదాల జల్లులా ప్రేక్షకుల్ని మెప్పించే చిత్రమిదని దర్శకుడు మోహనకృష్ణ ఇంద్రగంటి తెలిపారు. రూప కొడువాయూర్, నరేష్ విజయకృష్ణ, తనికెళ్ల భరణి, శ్రీనివాస్ అవసరాల తదితరులు నటిస్తున్నారు. ఏప్రిల్ 18న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: వివేక్సాగర్, రచన-దర్శకత్వం: మోహనకృష్ణ ఇంద్రగంటి.
