హీరో కార్తి నటిస్తున్న చిత్రం స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్దార్. రాశి ఖన్నా, రజిషా విజయన్ కథానాయికలు. అభిమన్యుడు దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్‌లో ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధిగా ఈ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ ఈ సినిమా ట్రైలర్ అదిరిపోయింది. ఈ సినిమా చేసినందుకు కార్తి గర్వపడుతున్నానని తెలిపారు. కార్తి చాలా వైవిధ్యమైన సినిమాలు చేసే తన అన్నయ్య సూర్య అంత సూపర్ స్టార్ అయ్యారు. అభిమన్యుడు ఫేం పిఎస్ మిత్రన్ అద్భుతమైన దర్శకుడు. సర్దార్‌ని కూడా గొప్పగా తీసుంటాడని నమ్ముతున్నాను అని అన్నారు.
హీరో కార్తి మాట్లాడుతూ సర్దార్ నా కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీ. తొలిసారి తండ్రి కొడుకులుగా నటించాను. ఇందులో స్పై పాత్ర చాలా స్పెషల్. సర్దార్ గ్రేట్ హీరో, ఏమీ ఆశించకుండా దేశం కోసం పని చేసిన హీరో. ఆ పాత్ర చేసినప్పుడు చాలా గర్వంగా ఫీలయ్యాను. పోలీస్ క్యారెక్టర్ విషయానికి వస్తే ఈ తరానికి తగ్గట్టుగా వుంటుంది. ఒక సినిమాలో రెండు జనరేషన్లు చూపించడం ఒక సవాల్. ఇది ఇండియన్ స్పై థ్రిల్లర్. పి.ఎస్ మిత్రన్ ఈ చిత్రాన్ని అద్భుతంగా తీశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో రజిషా విజయన్, లైలా, రాకేందుమౌళి తదితరులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ సినిమాని తెలుగు రాష్ట్రాలలో భారీగా విడుదల చేస్తోంది. దీపావళి కానుకగా ఈ నెల 21న ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతుంది.