Skip to main content

Namaste NRI

టార్గెట్‌ పై గురిపెట్టిన సత్యభామ

కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న చిత్రం సత్యభామ. సుమన్‌ చిక్కాల దర్శకుడు. బాబి తిక్క, శ్రీనివాసరావు తక్కలపల్లి నిర్మాతలు. నవీన్‌చంద్ర ఇందులో అమరేంద్రగా కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రకాశ్‌రాజ్‌ది ప్రత్యేకమైన పాత్ర.  పోస్ట్‌ప్రొడక్షన్‌ దశలో ఉన్న ఈ చిత్రాన్ని వచ్చే నెల 17న విడుదల చేయనున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. దీనికోసం ఓ క్రియేటివ్‌ వీడియోను కూడా విడుదల చేశారు. ఓ క్రైమ్‌ నుంచి రికవరీ చేసిన గన్‌ విడి పార్ట్స్‌ లోడ్‌ చేసి కాజల్‌ షూట్‌ చేయగా, అది క్యాలెండర్‌లో మే 17 డేట్‌ని టార్గెట్‌ చేస్తూ దూసుకెళ్తుంది. అప్పుడు సత్యభామ మే 17 అని రివీల్‌ అవుతుంది. ఈ కంటెంట్‌తోపాటు ఇప్పటివరకూ విడుదలైన ప్రమోషనల్‌ కంటెంట్‌ కూడా కొత్తగా ఉండటంతో సినిమాపై అంచనాలు పెరిగాయని, సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని నిర్మాతలు నమ్మకం వెలిబుచ్చారు. చిత్రానికి కెమెరా: బి.విష్ణు, సంగీతం: శ్రీచరణ్‌ పాకాల, సమర్పణ: ‘మేజర్‌’ఫేం శశికిరణ్‌ తిక్క.

Social Share Spread Message

Latest News