లావణ్య త్రిపాఠీ, సత్య నరేష్, అగస్త్వ, వెన్నెల కిషోర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా హ్యాపీ బర్త్ డే. యాక్షన్ కామెడీ థ్రిల్లర్ గా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం రెగ్యులర్ చిత్రీకరణ జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమా నుంచి నటుడు సత్య ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మత్తు వదలరా చిత్రంలో మంచి కామెడీ పాత్రతో బాగా నవ్వించారు సత్య. ఫిక్షనల్ ప్రపంచంలో సాగే హ్యాపీ బర్త్ డే ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని పంచే చిత్రమవుతుందని నిర్మాతలు నమ్మకంతో ఉన్నారు. మత్తు వదలరా చిత్రంలో గుర్తింపు తెచ్చుకున్న రితేష్ రానా ఈ చిత్రానికి దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చిరంజీవి (చెర్రీ), హేమలతా పెదమల్లు నిర్మాణ బాధ్యతలు వహిస్తుండగా నవీన్ యేర్నేని, వై రవి శంకర్ సమర్పిస్తున్నారు. సంగీతం : కాలభైరవ, సినిమాటోగ్రఫీ : సురేష్ సారంగం, ఫైట్స్ శంకర్ ఉయ్యాల. కథ, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం` రితేష్ రానా.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/criminalcourt-300x160.jpg)