హమరేశ్, ప్రార్థన సందీప్ జంటగా నటించిన టీనేజ్ ప్రేమకథ సత్య. వాలీ మోహన్‌దాస్ దర్శకత్వం. తమిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శివ మల్లాల తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్నారు. ఈ సందర్భంగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ని హైదరాబాద్‌లో నిర్వహించారు. ప్రతి తండ్రి తన కొడుకుకు ఏమిద్దామా అని ఆలోచించే సొసైటి మనది. అలాంటి సొసైటిలో నా వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదు అని ఆలోచించే కొడుకు కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఫాదర్ సెంటిమెంట్‌తో వస్తున్న ఈ ట్రైలర్ ప్రస్తుతం ఆకట్టుకుంది.
దర్శకులు సతీశ్ వేగేశ్న, మధుర శ్రీధర్, కృష్ణ చైతన్య, పవన్ సాధినేని, అర్జున్, సీనియర్ జర్నలిస్ట్ ప్రభు అతిథులుగా విచ్చేసి చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. ఒక జర్నలిస్ట్‌గా రివ్యూ ఇద్దామని సినిమా చూశా. దీన్ని తెలుగు ప్రేక్షకులకు కూడా చూపించాలి అనిపించి నిర్మాతగా మారాను అని శివ మల్లాల అన్నారు. మరోవైపు ఈ సినిమాకు సెన్సార్ బోర్డ్ యు సర్టిఫికెట్‌ను అందజేసింది. ఈ చిత్రం మే 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.