
బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న యాక్షన్ అడ్వెంచర్ వార్ 2. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజీలో భాగంగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఆగస్ట్ 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను దర్శకుడు అయాన్ ముఖర్జీ వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎందరో ఇష్టపడ్డ వార్ చిత్రానికి కొనసాగింపుగా వార్ 2 చేయడాన్ని బాధ్యతగా భావిస్తున్నా.వార్ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. వారితో పాటు హృతిక్, తారక్‌లకు కూడా అశేషమైన అభిమానులున్నారు. నిజంగా చెప్పాలంటే ఓ దర్శకుడికి ఇదో పెద్ద ఛాలెంజ్. ప్రేక్షకులకు ఓ గొప్ప థియేటర్ ఎక్స్‌పీరియన్స్ అందించేలా వార్ 2 ను రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ పాత్రల మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అవుతుంది. అభిమానుల అంచనాలు మించేలా, వారికి లైఫ్‌టైమ్ ఎక్స్‌పీరియన్స్‌లా ఈ సినిమా ఉంటుంది అని తెలిపారు.
