Namaste NRI

సత్యం రాజేష్ టెనెంట్ టైటిల్ గ్లింప్స్ విడుదల

సత్యం రాజేష్ హీరోగా నటించిన చిత్రం టెనెంట్.  ఈ  చిత్రం  టైటిల్ గ్లింప్స్‌ను మేకర్స్ లాంచ్ చేశారు. మహాతేజ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రం మన చుట్టూ జరిగే సంఘటనలకి దగ్గరగా ఉండే ఒక సింపుల్ ఫ్యామిలీ ఎమోషనల్ మర్డర్ మిస్టరీ కథ.  ముఖ్యంగా ఆడవాళ్లు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అద్భుతం చిత్రాన్ని నిర్మించిన మొగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, వై. యుగంధర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ,  స్ర్కీన్‌ప్లే, సంభాషణల్ని కూడా అందించారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి మరిన్ని వివరాలను మేకర్స్ తెలియజేయనున్నారు. సత్యం రాజేష్, మేఘా చౌదరి, చందన పయ్యావుల, భరత్ కాంత్, తేజ్ దిలీప్, ఆడుకాలం నరేన్, ఎస్తేర్ నొరోన్హ, ధనా బాల, చందు, అనురాగ్, రమ్య పొందూరి, మేగ్న తదితరులు నటిస్తున్నారు.  ఈ   చిత్రానికి  మ్యూజిక్ కంపోజర్ మరియు లిరిసిస్ట్: సాహిత్య సాగర్, ఈ చిత్రం ఈ నవంబర్ 3న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events