ఆఫ్రికా దేశాల్లో కరోనా కొత్త జీ.1.1.5.2.9 వేరియంట్ కలకలం సృష్టిస్తున్నది. ఇది వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. వైరస్ ప్రభావం అత్యధికంగా ఉన్న ఏడు దేశాలకు సౌదీ అరేబియా రాకపోకలు నిషేధించింది. ఇందులో దక్షిణాఫ్రికా, జింబాంబ్వే, బోట్స్‌వానా, మొజాంబిక్, లెసోతో, ఎస్వతినీ దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు చెందిన పర్యాటకులకు సౌదీకి అనుమతి లేదని అధికారులు ప్రకటించారు. అయితే ఇతర దేశాల్లో 14 రోజుల ఉన్న తర్వాత, సౌదీ ఆరోగ్య నియామాలు పాటిస్తూ వారికి తమ దేశంలోకి అనుమతిస్తామని తెలిపారు.