
వార్షిక హజ్ యాత్ర సమీపిస్తున్న తరుణంలో అక్రమ వలసదారులపై సౌదీ అరేబియా కఠిన చర్యలు తీసుకుంటున్నది. ఈ యాత్ర జూన్ 4-9 మధ్య జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భద్రత నిబంధనల ఉల్లంఘనదారులపై సౌదీ అరేబియా కొరడా ఝళిపించింది. మార్చి 27-ఏప్రిల్ 2 మధ్య కాలంలో 18,407 మందిని అరెస్ట్ చేసింది. చట్టవిరుద్ధంగా దేశంలో ప్రవేశించేందుకు 1,260 మంది, దేశం నుంచి వెళ్లిపోయేందుకు 67 మంది ప్రయత్నించారని తెలిపింది. అక్రమంగా ప్రవేశించేవారికి సహకరించే వ్యక్తులకు భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
