సౌదీ అరేబియాలో ఉన్న ముస్లింలకు అక్కడి ప్రభుత్వం గోల్డెన్ ఛాన్స్ ఇచ్చింది. టూరిస్ట్, విజిట్ వీసాదారులను ఉమ్రాకు అనుమతి ఇచ్చింది. యాత్రికులు ఈతమార్న, తవక్కల్నా యాప్‌లలో దీనికి అవసరమైన రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేసిన తర్వాత ఉమ్రా పర్మిట్ పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు హజ్, ఉమ్రా మినిస్త్రీ తాజాగా కీలక ప్రకటన చేసింది. వ్యాక్సినేషన్ పూర్తి చేసుకుని టూరిస్ట్ లేదా విజిట్ వీసాలపై కింగ్‌డమ్‌కు వస్తున్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈతమార్నలో అకౌంట్ క్రియేట్ చేసేందుకు తవక్కల్నా యాప్‌లో విజిటర్‌కు సంబంధించిన ఇమ్యూన్ హెల్త్ స్టెటస్‌ను అప్‌డేట్ చేయడం తప్పనిసరి.
500 ఉమ్రా సేవా సంస్థలు, 6,00 విదేశీ ఉమ్రా ఏజెంట్లు టీకాలు తీసుకున్న విదేశీ ఉమ్రా యాత్రికులను ఆగస్టు 9 నుంచి స్వీకరించడం ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా రిజర్వేషన్ల కోసం అందుబాటులో ఉన్న 30 ఎలక్ట్రానిక్ సైట్‌ల ద్వారా యాత్రికులు ఉమ్రా ప్యాకేజీలను బుక్ చేసుకోవచ్చు. అలాగే డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా చెల్లింపులు చేయవచ్చని సంబంధిత అధికారులు తెలిపారు. రెండు డోసులు వ్యాక్సినేషన్ పూర్తి చేసుకున్న వారు లేదా మొదటి డోసు తీసుకుని 14 రోజులు పూర్తి అయిన వారికి మాత్రమే ఇమ్యూన్ స్టేటస్ అప్‌డేటింగ్‌కు వీలు ఉంటుందని మినిస్ట్రీ వెల్లడిరచింది.