
ఉమ్రా, బిజినెస్, ఫ్యామిలీ విజిట్ వీసాల జారీపై సౌదీ అరేబియా తాత్కాలిక నిషేధం విధించింది. సరైన రిజిస్ట్రేషన్ లేకుండా హజ్ యాత్ర చేయడానికి జరిగే ప్రయత్నాలను నిరోధించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. చాలా దేశాల నుంచి ఇటువంటి వీసాలపై వచ్చి, గడువు ముగిసినప్పటికీ సౌదీ అరేబియా లోనే ఉంటూ, అధికారిక ధ్రువీకరణ లేకుండా హజ్‌లో పాల్గొంటున్నారని అధికారులు తెలిపారు.ఈ తాత్కాలిక నిషేధం భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్ సహా 14 దేశాల నుంచి వచ్చేవారికి వర్తిస్తుందని చెప్పారు. హజ్ యాత్ర సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు వీసాల జారీపై కఠిన నిబంధనలను అమలు చేస్తున్నట్టు తెలిపింది.
