సౌదీ అరేబియా విదేశీ పర్యాటకులకు తీపి కబురు చెప్పింది. అందులోనూ బ్రిటన్, అమెరికాతో పాటు షెంజెన్ వీసా హోల్డర్లు, యూరోపియన్ యూనియన్ దేశాల పర్మినెంట్ రెసిడెంట్స్ సులువుగా తమ దేశంలోకి ఎంట్రీ పొందవచ్చని తెలిపింది. దీనికోసం విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ద్వారా తక్షణ ఇ-వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని సౌదీ పర్యాటక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. యూకే, యూఎస్ లేదా షెంజెన్ దేశాలలో ఒకదాని నుంచి చెల్లుబాటయ్యే విజిట్ వీసా గానీ, బిజినెస్ వీసా గానీ ఉన్నవారికి మినహాయింపు ఉంటుందని ప్రకటించింది. ఇలా మినహాయింపు ఉన్న వీసాదారులు ఫస్ట్-డిగ్రీ బంధువులతో పాటు యూఎస్, ఈయూ, యూకేలో శాశ్వత నివాసం ఉన్న వారికి అదే ప్రవేశ హక్కులను మంజూరు చేసే వెసులుబాటు కల్పించింది.కాగా, శాశ్వత వీసాదారులు ఏదైనా ఎయిర్, ల్యాండ్, ఓడరేవుల వద్ద ఆన్-అరైవల్ వీసా ద్వారా కింగ్‌డమ్‌లోకి ఫస్ట్-డిగ్రీ రిలేటివ్స్‌కు యాక్సెస్ కల్పించవచ్చు. అయితే, ధృవీకరణ పత్రాలు ఎల్లప్పుడు వెంట తెచ్చుకోవాలని సూచించింది.
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/9f49e8d2-8280-46f1-9cd4-82d86a88c854-49-126-4-116.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/45af6911-9449-466d-a7e1-ba146800284b-124-4-115.jpg)
![](https://namastenri.net/wp-content/uploads/2023/06/638bff07-efd2-4cc9-8546-98039833db3c-132-4-117.jpg)