చౌక ధరకే ఇల్లు లేదా ఇతరత్రా ఆస్తులను కొనుగోలు చేసే అవకాశాన్ని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) కల్పిస్తోంది. అక్టోబర్ 25న ఎస్‌బీఐ ఇ వేలం నిర్వహించనుంది. ఎస్‌బీఐ మెగా ఇ
వేలం ద్వారా మార్కెట్ ధర కంటే తక్కువకే ఇల్లు, ఫ్లాట్లు, షాపులను బిడ్ వేసి గెలుచుకునే అవకాశం ఉంది. ఆస్తులను కొనుగోలు చేయాలనుకునే వారు ఇ వేలంలో జాయిన్ అయ్యి బిడ్ వేయొచ్చని ఎస్‌బీఐ ప్రకటించింది. బ్యాంకు వద్ద తాకట్టు పెట్టి అప్పు చెల్లించలేని వారి ఆస్తులను ఇ
వేలం ద్వారా పారదర్శకంగా విక్రయిస్తున్నాం. వేలం వేసే ఆస్తులకు సంబంధించిన కోర్టు ఉత్తర్వులతో పాటు కావాల్సిన అన్ని పత్రాలు, వివరాలు బిడ్డర్లకు అందజేస్తాం అని ఎస్‌బీఐ తెలిపింది. వేలం కోసం ఉంచి ఆస్తుల వివరాలను సామాజిక మాధ్యమాల ద్వారా ఇచ్చిన ప్రకటనలో అందించిన లింక్‌ల ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఆసక్తి ఉన్న వారు వేలం వేసే విధానం, అతడు/ ఆమె కొనుగోలు చేయాలనుకునే ఆస్తి గురించి సందేహాల నివృత్తి కోసం సంబంధిత బ్రాంచ్‌లను సంప్రదించొచ్చు అని ఎస్‌బీఐ తెలిపింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/protests-300x160.jpg)