కిరణ్ అబ్బవరం హీరోగా నటిస్తున్న కొత్త సినిమా సెబాస్టియన్ పీసీ 524. కోమలీ ప్రసాద్, సువేక్ష నాయికలుగా నటిస్తున్నారు. తాజాగా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ చిత్రానికి సెన్సార్ నుంచి యూ.ఏ సర్టిఫికెట్ లభించింది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ కిరణ్ అబ్బవరం గత రెండు చిత్రాల్లాగే ఈ సినిమా కూడా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం. కుటుంబమంతా కలిసి చూసేలా సినిమా ఉంటుంది. అందుకే సెన్సార్ నుంచి యూ.ఏ ధృవీకరణ ఇచ్చారు అని అన్నారు. శ్రీకాంత్ అయ్యంగార్, సూర్య, రోహిని రఘువరన్ తదితర ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: జిబ్రాన్, సినిమాటోగ్రఫీ: రాజ్ కె నల్లి. జ్యోవిత సినిమాస్ పతాకంపై ఎలైట్ ఎంటర్టైన్మెంట్ సమర్పణలో సిద్ధారెడ్డి. జయచంద్ర రెడ్డి, రాజు, ప్రమోద్ నిర్మించారు. బాలీజీ సయ్యపురెడ్డి దర్శకుడు. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా మార్చి 4న ఈ సినమా విడుదలకు సిద్ధమవుతున్నది.