అమెరికాలోని కనెక్టికట్‌లో స్వచ్ఛందసంస్థ సత్సంకల్ప ఫౌండేషన్ ద్వితీయ వార్షికోత్సవం వైభవంగా జరిగింది. భారతీయత పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రవాస భారతీయులకు మన దేశ సనాతన సంప్రదాయాల ఔన్నత్యాన్ని చాటిచెప్పడం దీని ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు వెల్లడిరచారు. సద్గురు శ్రీ శివానందమూరి చిత్ర పటం వద్ద జ్యోతి ప్రజలనతో కార్యక్రమం ఆరంభమైంది. ముఖ్య అతిథిగా రిటైర్డ్ దౌత్యవేత్త మిత్ర వశిష్ట, భారత దౌత్య కార్యాలయానికి చెందిన ప్రజ్ఞాసింగ్ ప్రత్యేక అతిథిగా విచ్చేశారు సత్సం కల్ప ఫౌండేషన్ అధ్యక్షులు, స్థాపకులు శ్రీధర్ తాళ్ళపాక సభనుద్దేశిస్తూ ప్రసంగించారు. ప్రతిఒక్కరూ స్వీయధర్మ పరిశీలన చేసుకోవడం చాలా ముఖ్యమన్నారు. అది సమాజానికి ఎంతో అవసరమని, శ్రేయస్కరమని సందేశమిచ్చారు.


సనాతన ధర్మాన్ని పాటిస్తున్నందుకు గానూ ప్రొఫెసర్ ఎమిరటస్ పీఆర్ ముకుంద్, డాక్టర్ ఉమా వైజయంతి మాల కాళ్ళకూరి, మధురెడ్డిని శివానంద స్మృతి పురస్కారంతో సంస్థ ప్రతినిధులు సత్కరించారు. కార్యక్రమం లో భాగంగా కనెక్టికట్‌లో ఉన్న వివిధ నాట్య సంస్థల నుంచి 28 మంది చిన్నారులు కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ నృత్యాలను ప్రదర్శించారు. ఆయా సంస్థల నాట్య శిక్షకులను, సనాతన ధర్మాన్ని పాటిస్తూన్న మరో ఆరు సాంస్కృతిక సంఘాల సంస్థాపకులను కూడా సంస్థ ఈ సందర్భంగా సత్కరించింది. కార్యక్రమానికి విచ్చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేసి, రెండు దేశాల జాతీయ గీతాలాపనతో కార్యక్రమాన్ని ముగించారు. వచ్చిన అతిథులందరికీ శాకాహార విందును సత్సంకల్ప ఫౌండేన్ ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి భారత్, కెనడా, స్కాట్లాండ్ దేశాలతో పాటు అమెరికాలోని పలు రాష్ట్రాల నుంచి 664 మందికి పైగా హాజరయ్యా రు. మరో 300 మంది అంతర్జాలంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు.


