కెనడాలో భారతీయులపై దాడులు పెరిగిపోతున్నాయి. ఈ నెల 1న బిజినెస్ మేనేజ్‌మెంట్ విద్యార్థి గురసిస్ సింగ్ (22)ను రూమ్‌మేట్ హత్య చేయగా, ఈ నెల 6న సెక్యూరిటీ గార్డ్ హర్షణ్‌దీప్ సింగ్ (20)ని కాల్చి చంపే శారు. హర్షణ్‌దీప్ కేసులో ఇద్దర్ని అరెస్ట్ చేసినట్లు ఎడ్మంటన్ పోలీసులు ప్రకటించారు. తమకు సమాచారం అందిన వెంటనే అపార్ట్‌మెంట్‌కు వచ్చి చూశామని, స్పృహలేని స్థితిలో ఉన్న హర్షణ్‌దీప్‌ను దవాఖానకు తరలించామని, ఆయన మరణించినట్లు వైద్యులు ప్రకటించారని పోలీసులు చెప్పారు. సీసీటీవీ ఫుటేజ్‌లో ముగ్గురు దుండగులు హర్షణ్‌దీప్‌పై దాడి చేసినట్లు కనిపించింది.