Skip to main content

Namaste NRI

రికార్డ్ బ్రేక్ మూవీ నుంచి సెకండ్ లిరికల్ రిలీజ్

చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం రికార్డ్‌ బ్రేక్‌. చదలవాడ పద్మావతి నిర్మాత. నిహార్‌, నాగార్జున, రగ్థా ఇఫ్తాకర్‌ ప్రధాన పాత్రధారులు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకు మంచి స్పందన లభిస్తున్నదని మేకర్స్‌ సంతోషం వెలిబుచ్చారు. ఈ చిత్రానికి సంబంధించిన రెండవ పాటను చిత్రబృందం విడుదల చేశారు. మళ్లీ పుట్టి వచ్చినవా  అంటూ సాగే ఈ పాటను వరికుప్పల యాదగిరి రాసి, ఆలపించారు. సాబు వర్గీస్‌ స్వరపరిచారు. పాన్‌ ఇండియా స్థాయిలో ఎనిమిది భాషల్లో ఈ చిత్రం విడుదల కానుందని, సెన్సార్‌ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేస్తామని చదలవాడ శ్రీనివాసరావు తెలిపారు. ఈ చిత్రానికి కథ: అంజిరెడ్డి శ్రీనివాస్‌, కెమెరా: కంతేటి శంకర్‌.

Social Share Spread Message

Latest News