Skip to main content

Namaste NRI

అమెరికాలో విదేశాంగ మంత్రుల రహస్య సమావేశం

భారత్‌, కెనడా దౌత్య సంబంధాలు దెబ్బతిన్న నేపథ్యంలో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు అమెరికాలో రహస్యంగా సమావేశమైనట్టు తెలిసింది. భారత విదేశాంగ మంత్రి జైశంకర్‌, కెనడా విదేశాంగ మంత్రి మెలానీ జోలీతో సమావేశమైనట్టు తెలిసింది. వాషింగ్టన్‌లో జరిగిన ఈ భేటీకి అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చొరవ తీసుకున్నారు.  దౌత్య పరమైన సంబంధాలు మెరుగుపర్చుకునే దిశగా ఈ సమావేశంలో చర్చ జరిగినట్టు తెలిసింది.. ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్‌ను హత్య వెనుక భారత అధికారుల హస్తం ఉందంటూ కెనడా ప్రధాని ఆరోపించడంతో ఇరుదేశాల దౌత్య పరమైన ప్రతిష్టంభన నెలకొన్న విషయం విదితమే. అయితే ఈ సమావేశం జరిగినట్లు ఇరుదేశాల అధికార ప్రతినిధులు ఎవరూ నిర్థారించలేదు. అమెరికాలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారనేది వెల్లడికాలేదు.

Social Share Spread Message

Latest News