నివాస్ శిష్ణు, సారా ఆచార్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం రహస్య. శివ శ్రీ మీగడ దర్శకత్వం. గౌతమి ఎస్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ని చిత్రబృందం విడుదల చేసింది. ఈ చిత్రంలో ఎన్‌ఐఏ ఆఫీసర్ విశ్వతేజ పాత్రలో కనిపిస్తారు నివాస్. క్రైమ్ మిస్టరీ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ఓ హత్య వెనకున్న రహస్యాన్ని పోలీసులు ఎలా చేధించారనే కథతో ఆసక్తికరంగా సాగుతుంది. ప్రేక్షకులు థ్రిల్ అవుతారు అని చిత్ర యూనిట్ పేర్కొంది. బుగతా సత్యనారాయణ, గెద్ద వరప్రసాద్, దాసరి తిరుపతి నాయుడు, వేద భాస్కర్, కారం వినయ్ ప్రసాద్, సూరిబాబు, పాండురంగరావు, ప్రదీప్, మోడల్ శ్రీను తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. సంగీతం: చరణ్ అర్జున్.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)