Skip to main content

Namaste NRI

డొనాల్డ్ ట్రంప్ ప్రణాళికకు.. భద్రతా మండలి ఆమోదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన గాజా శాంతి ప్రణాళికకు ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. రెండేండ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధానికి ముగింపుపలికేందుకు 20 సూత్రాల ప్రణాళికను డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రతిపాదించిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ బలగాల నియోగం, యుద్ధ విరామం, పునర్నిర్మాణం, పాలనకు మార్గదర్శకాలు ఇందులో ఉన్నాయి. ఈ ఒప్పందంపై ఇజ్రాయెల్‌-పాలస్తీనా తీవ్రవాద గ్రూపు హమాస్‌ గత నెల 10న సంతకాలు చేశాయి.

ఐక్యరాజ్యసమితో జరిగిన ఓటింగ్‌లో అమెరికా, యూకే, ఫ్రాన్స్, సోమాలియా సహా మొత్తం 13 దేశాలు గాజా శాంతి ప్రణాళికకు మద్దతు తెలిపాయి. వీటో అధికారం ఉన్న రష్యా, చైనా ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. గత నెలలో యుద్ధ విరామం, బందీల విడుదల ఒప్పందంతో ప్రణాళిక మొదటి దశను అమలు చేసిన సంగతి తెలిసిందే. బోర్డ్ ఆఫ్ పీస్ అనే తాత్కాలిక సంస్థను ఏర్పాటు చేసి.. గాజా పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించాలన్నది గాజా ప్లాన్‌ ఉద్దేశం.

Social Share Spread Message

Latest News